రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం జరిగే పోరాటం ఒక ప్రాంతం కోసం కాదు... లక్షలాది రైతుల హక్కుల కోసం జరిగే మహా ఉద్యమం. కరువు నేలగా మిగిలిన రాయలసీమను పచ్చని పంటల సీమగా మార్చే శక్తి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే ఉంది. సాగునీటి హక్కు కోసం న్యామద్దల గడ్డపై చేపట్టిన పోరాటం ఆరంభం మాత్రమే. ఇది కొనసాగుతుంది. హంద్రీ–నీవా ద్వారా కరువు జిల్లాలో కృష్ణాజలాలు పారించిన ఘనత వైఎస్సార్‌దే. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు కృష్ణా జలాలు అందించాలనే ప్రతిపాదన ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేశారు. – కేవీ ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు


