
ప్రియురాలికి పెళ్లి.. ప్రేమికుడి ఆత్మహత్య
యాడికి: తాను ప్రేమించిన యువతికి మరో యువకుడితో పైళ్లెనట్లు తెలుసుకుని క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన బాలగంగన్న, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు జయకృష్ణ (22) ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. ఆమెతో తనకు పెళ్లి చేయాలని 3 నెలల క్రితం తల్లిదండ్రులను కోరాడు. అయితే నెల రోజుల క్రితం ఆ యువతికి మరో యువకుడితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లుగా తెలిసింది. దీంతో మనోవేదనకు లోనైన జయకృష్ణ శనివారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున పిలిచినా స్పందన లేకపోవడంతో మిద్దైపెకి ఎక్కి గవాక్షం నుంచి కుటుంబసభ్యులు చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న జయకృష్ణను చూసి, బలవంతంగా తలుపులు తీసి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
శెట్టూరు: కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌ఐ రాంభూపాల్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బచ్చేహళ్లి గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులను గమనించి స్కూటీపై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని ఆపి పారిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు వాహనం దగ్గరకు చేరుకుని పరిశీలించగా 520 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎరువుల దుకాణాల్లో
కొనసాగుతున్న తనిఖీలు
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు ఊపందుకున్నాయి. ఆదివారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వైబీపీటీఏ ప్రసాద్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని ఆరు దుకాణాల్లో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ–పాస్ మిషన్లతో పోల్చినప్పుడు స్టాక్‌లో వ్యత్యాసాలు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 60.18 మెట్రిక్ టన్నుల ఎరువులను విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ కె.శ్రీనివాసులు, జమాల్ బాషా, వ్యవసాయాధికారి వాసుప్రకాష్, డీసీటీఓ బి.సురేష్‌కుమార్, ఎస్‌ఐలు జి.గోపాలుడు, ఎస్.నరేంద్ర భూపతి పాల్గొన్నారు.

ప్రియురాలికి పెళ్లి.. ప్రేమికుడి ఆత్మహత్య

ప్రియురాలికి పెళ్లి.. ప్రేమికుడి ఆత్మహత్య