
కానిస్టేబుల్‌కు టీచర్ ఉద్యోగం
కణేకల్లు: కణేకల్లు వాసి, పోలీసుశాఖలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సి.అశోక్ డీఎస్సీలో జిల్లాస్థాయిలో ర్యాంకు సాధించారు. బీకాం బీపెడ్ (బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) చేసిన అశోక్‌కు టీచర్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. 2017లో కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ అయ్యారు. ప్రస్తుతం ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో నిర్వహించిన డీఎస్సీలో ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాలేకపోయారు. నిరాశ చెందకుండా డీఎస్సీకి ప్రిపేర్ అయి జిల్లాలోనే 6వ ర్యాంకు సాధించారు. 150 మార్కులకుగాను 86.5 మార్కులు సాధించినట్లు అశోక్ తెలిపారు. అశోక్ టీచర్ ఉద్యోగానికి ఎంపికతో ఆయన తండ్రి హనుమంతప్ప, సోదరుడు సతీష్, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.