వావ్.. చాలా బాగుంది!
ఫుట్‌పాత్ పొడవునా తాటిముంజల విక్రయాలు చేపట్టిన దృశ్యం
ఐస్ ఆపిల్‌గా పిలిచే తాటిముంజలను నోట్లో పెట్టుకోగానే.. ’వావ్.. చాలా బాగుంది’ అని మనకు తెలియకుండానే మాట జారిపోతుంటుంది. వేసవిలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంటుంటారు. ఇంతటి అమృత ఫలాన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు అనంతపురంలోని వైద్య కళాశాల ఎదురుగా ఫుట్‌పాత్‌పై పెట్టుకుని విక్రయిస్తున్నారు. కొనుగోలుదారుల సమక్షంలోనే తాటికాయ గెలల నుంచి తాజా ముంజలను వేరు చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


