
● ఏపీ దేవదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్
అనంతపురం కల్చరల్: ఆలయాల పునరుద్ధరణ, అబివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని సహకారమందిస్తోందని ఏపీ దేవదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. అనంతపురంలోని వందేళ్ల నాటి కాశీవిశ్వేశ్వర కోదండరామాలయం పునరుద్ధరణ అంశంపై గురువారం ఆలయ కమిటీ మెంబర్లు తిమ్మారెడ్డి, సుబ్రహ్మణ్యం, వెంకటస్వామి, ఈఓ రమేష్‌బాబు తదితరులు గురువారం విజయవాడలో ఎండోమెంటు కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంటు సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ను కలసి మాట్లాడారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని వారు హామీనివ్వడంతో హర్షం వ్యక్తంచేశారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈఓ రామారావును, ఎండోమెంటు అధికారులను శివాలయం ప్రతినిధులు సత్కరించారు.