స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

మునగపాక: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. చూచుకొండలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన ప్రగతితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ చూచుకొండతో పాటు ఇతర పంచాయతీల్లోని ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండాలు ఎగురవేయాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఎంపీటీసీ కాండ్రేగుల కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ పెంటకోట హరేరామ, మాజీ సర్పంచ్‌ దొడ్డి సూరప్పారావు, మాజీ ఎంపీటీసీ పెంటకోట నాయుడు, గణపర్తి, పల్లపు ఆనందపురం, మెలిపాక, మడకపాలెం, రామగిరి, చెర్లోపాలెంకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement