● జాతీయ రైతు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కన్నారావు
మాడుగుల రూరల్: జిల్లా లో సుగర్ ఫ్యాక్టరీలను పరిరక్షించి, చెరకు రైతులను ఆదుకోవాలని జాతీయ రైతు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆడారి కన్నారావు కోరారు. కె.జె.పురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీతో పాటు తుమ్మపాల, తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలు రైతులకు అండగా నిలిచేవని, ఫ్యాక్టరీలను మూసివేసి అన్నదాతల, కార్మికుల పొట్టకొట్టారని తెలిపారు. రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే క్రషింగ్ సీజన్‌లోనైనా సుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి, చెరకు రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన డిమాండ్ చేశారు.


