నేడు పిడుగులతో కూడిన వర్షాలు | - | Sakshi
Sakshi News home page

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

సాక్షి, అనకాపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నా యి. శనివారం 8.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పరవాడలో 19.8 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా రావికమతం మండలంలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకూ 45.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో సాగునీటి కాలువలు, చెరువుల్లోకి కొద్దిపాటి నీరు చేరుతోంది. మండలాల వారీగా నమో దైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పరవాడ మండలంలో 19.8 మిల్లీమీటర్లు, కె.కోటపాడు 17.6, నక్కపల్లి 16.2, ఎస్‌.రాయవరం 10.8, బుచ్చెయ్యపేట 10.4, నాతవరం 10.2, అనకాపల్లి 9.8, రోలుగుంట 9.4, కశింకోట 9.4, రాంబిల్లి 9, సబ్బవరం 8.6, నర్సీపట్నం 8.2, యలమంచిలి 8.2, గొలుగొండ 7.4, మాడుగుల 7.4, కోటవురట్ల 6.2, మునగపాక 5.6, చీడికాడ 5.4, దేవరాపల్లి 5.4, అచ్యుతాపురం 5.2, పాయకరావుపేట 4.8, చోడవరం 3.2, రావికమతంలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement