నక్కపల్లి: జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సీఐ జె.మురళి తెలిపిన వివరాల ప్రకారం తమ్మయ్యపేటకు చెందిన సూరాకాసుల గురుమూర్తి(46) వెదుళ్లపాలెంలో ఉంటూ బోదిగల్లం పునరావాసకాలనీలో తన కొత్త ఇంటిపనులు ముగించుకుని రోడ్డుపై నడచి వెళ్తుండగా అనకాపల్లి నుంచి తునివైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. గురుమూర్తి తీవ్రంగా గాయ పడి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


