జ్వరంతో బాధపడుతున్న నా కుమారుడు విఘ్నేష్‌ను జూలై 7న ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లాను. వైద్యులు రక్త పరీక్షలు రాసి, మందులు అందజేశారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేసిన రక్త పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ కాలేదు. సుమారు 15 రోజుల పాటు మందులు వాడినా జ్వరం తగ్గలేదు. 20 రోజుల తరువాత పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా టైఫాయిడ్ జ్వరం అని నిర్ధారణ అయింది. ప్రైవేట్ వైద్యులు ఇచ్చిన మందులు వాడడంతో బాబు ఆరోగ్యం కుదుటపడింది.
– గొల్లవిల్లి శ్రీను, కొత్తూరు, అనకాపల్లి మండలం.


