11 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వందేమాతరం, దేశ్‌రంగీలా, తల్లిభారతి, కోలాటం, వేదభూమి ఇది, పిరమిడ్స్, థింసా, పాడవోయి భారతీయుడా, ఇదే మన భారతం, యోగా వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తానాం పాఠశాలకు ప్రథమ స్థానం
పరవాడ మండలం తానాం ఎంజీపీఎపీ బీసీఆర్ స్కూల్ విద్యార్థులు యోగా ప్రదర్శనలో మొదటి స్థానం సాధించగా, నక్కపల్లి మినీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ‘పాడవోయి భారతీయుడా’కు ద్వితీయ స్థానం లభించింది. కశింకోట మండలం ఏసీడీఎస్ విద్యార్థులు ప్రదర్శించిన ‘వందేమాతరం’కు మూడో స్థానం లభించింది.కోలాటం, థింసా ప్రదర్శించిన సరుగుడు గ్రామం పురుషులు, మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపి, బహుమతులను అందజేశారు.


