నక్కపల్లి: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి సప్తతి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా శనివారం శంషాబాద్ ఆశ్రమం నుంచి వచ్చిన కోదండరాముని హృదయ కలశ ఊరేగింపు ఉపమాక కల్కి వేంకటేశ్వరస్వామి ఆల య మాడవీధుల్లో ఘనంగా జరిగింది. వికాస తరంగిణి సభ్యులు, భక్తుల శ్రీరామనామస్మరణ మధ్య గోముఖ ముద్రతో బియ్యాన్ని సమర్పించారు. ఈ కలశాన్ని శంషాబాద్‌లోగల ఆశ్రమానికి పంపించ డం జరుగుతుందని ఉపమాక ప్రధానార్చకులు వరప్రసాద్ తెలిపారు. దీపావళి నాడు తిరునక్షత్ర మహోత్సవంలో ఈ కలశంతో 108 దివ్యదేశాలలో ఉన్న మూర్తులకు, కోదండరామునికి విశేష అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు.


