ఎందరో మహనీయుల త్యాగఫలం | - | Sakshi
Sakshi News home page

ఎందరో మహనీయుల త్యాగఫలం

Aug 16 2026 4:39 AM | Updated on Aug 16 2026 4:39 AM

అనకాపల్లి: మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 80 ఏళ్లు పూర్తయింది. ఎందరో సమర వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ మహాత్మగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, భగత్‌సింగ్‌, సర్ధార్‌ వల్లబాయ్‌పటేల్‌ వంటి అనేక మంది మహనీయులు పోరాటాలు చేయడం వల్ల మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సాకారమైందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉగ్గిన అప్పారావు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్‌, పార్టీ పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షులు కాండ్రేగుల హైమావతి, పద్మకుమారి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులు మర్రిపల్లి శోభ, పద్మ, లక్ష్మి, సీనియర్‌ నాయకులు సత్యనారాయణ, కుండల రామకృష్ణ, కడిమిశెట్టి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement