కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట సాగరతీరంలో ఆదివారం షూటింగ్ సందడి నెలకొంది. దర్శకుడు రవిబాబు నేలకుడితి దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ షూటింగ్‌లో భాగంగా హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొని సందడి చేశారు. ఆదివారం కావడంతో ఒకవైపు పర్యాటకులు, మరోవైపు చిత్ర బృందంతో మంగమారిపేట తీరం సందడిగా మారింది. సినీ తారలను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మంగమారిపేట బీచ్ వద్ద హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ పూజా హెగ్డే


