సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నూతన పంచాయతీ అఽధికారిగా ఎం.కిరణ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదివారం ఉత్తర్వు లు జారీ చేశారు. ఇప్పటి వరకూ డీపీఓగా
వ్యవహరిస్తున్న సందీప్‌ను అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేసిన నేపథ్యంలో కొత్త డీపీఓ నియామకం జరిగింది. కిరణ్‌కుమార్ ప్రస్తుతం బొబ్బిలి డీఎల్‌డీవోగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా అనకాపల్లి డీఎల్‌డీవో మంజులావాణిని ముందుగా డీపీవోగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేశారు. కిరణ్ కుమార్ ఈ వారంలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.


