సబ్బవరంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా జరిగింది. సబ్బవరం మండలంలోని యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న వారికి పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, యువజన విభాగం నాయకుడు పాలిశెట్టి సురేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


