మాడుగుల పాత బస్టాండ్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం, మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మూడో రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, జెడ్పీటీసీ కర్రి సత్యం, మండల అధ్యక్షులు రెడ్డి జగన్‌మోహన్, బూరె బాబురావు, వేమవరపు రామధర్మజ తదితరులు పాల్గొన్నారు.


