జననేత జగన్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

జననేత జగన్‌కు ఘన స్వాగతం

Jul 15 2026 1:16 AM | Updated on Jul 15 2026 1:16 AM

సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యటనకు విచ్చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎంపీ తనూజరాణి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, విశాఖ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్‌, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కంబాల జోగులు, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మాజీ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, వైఎస్సార్‌సీపీ మత్స్యకార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పేర్ల విజయచంద్ర, మత్స్యకార కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలా గురువులు, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌, మాజీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కె.సతీష్‌, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనాయకులు పరీక్షిత్‌ రాజు, జి.వెంకటేశ్వరరావు(జీవీ), జాన్‌వెస్లీ, చెన్నా జానకీరామ్‌, ద్రోణంరాజు శ్రీవాత్సవ్‌, పార్లమెంట్‌ పరిశీలకులు శరగడం చినఅప్పలనాయుడు, నియోజకవర్గ పరిశీలకులు వీసం రామకృష్ణ, చింతకాయల సన్యాసిపాత్రుడు, పేడాడ రమణికుమారి, జహీర్‌ అహ్మద్‌, గండి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement