రావికమతం: మాకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి తమకు మద్దతు ఇవ్వాలంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాఽథ్‌ను దస్తావేజు లేఖరులు కోరారు. చోడవరంలో అమర్‌నాథ్‌ను జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం ప్రతినిధులు మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశా రు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం చేర్చుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖరులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా అమర్‌నాఽథ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏమీ కల్పించకపోగా ఉన్న ఉపాధి అవకాశాలను దెబ్బతీసే పనులు మాత్రం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసేసి చెరకు రైతులను, కార్మికులను రోడ్డుపాలు చేశారన్నారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్ల జీవనాధారాన్ని నాశనం చేసే విధంగా కొత్త విధానాలకు తెరతీశారన్నారు. దీనిపై తమ అధినేతకు విన్నవించి దస్తావేజు లేఖరులకు తమ వంతు మద్దతు ఇస్తామని అమర్‌నాఽథ్ చెప్పారు. అమర్‌నాథ్‌ను కలిసిన వారిలో జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వడ్డాది రమేష్, టి. సీతారామయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శేఖరమంత్రి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండల ఉపా ధ్యక్షుడు చవితిని బాబూరావు పాల్గొన్నారు.


