అన్ని వర్గాలకు మొండి చేయి
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా మూడోసారీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మసిపూసి మారేడుకాయ చేసినట్టు బడ్జెట్ ఉందని విమ ర్శించారు.హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. సూపర్ సిక్స్ అమల్లో ప్రభుత్వం అట్టర్‌ప్లాప్ అయిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు అంతులేని హామీలిచ్చి..ఇప్పుడు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మొండిచేయి చూపారని మండిపడ్డారు.తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు బడ్జెట్‌లో కోతలు విధించి, సా మాన్యుల ఆశలపై నీళ్లు జల్లారని చెప్పారు. అభివృద్ధిని అంకెల రూపంలో చూపిస్తూ, ఆచరణ లో సాధ్యం కాని హామీలతో ఈ బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఎద్దేవా చేశా రు. అన్నదాత సుభీభవకు అరకొర నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో 54 లక్షల రైతు కుటుంబాలకు కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తామన్న హామీని చంద్రబాబు విస్మరించారని తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ పథకానికి పైసా కేటాయించకుండా మళ్లీ మోసం చేశారని విమర్శించారు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు మహిళలను దగా చేశారని తెలిపారు. ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయి లో చాలామందికి తల్లికి వందనం అందడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్‌లో మొండిచేయి చూపారని చెప్పారు పీఆర్సీ, ఐఆర్ ఊసేలేదన్నారు. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సీపీఎస్ రద్దుపైనా బడ్జెట్‌లో ప్రస్తావనలేదన్నారు. విద్యారంగాన్ని విస్మరించిందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంలో కోత విధించిందని చెప్పారు. బకాయిలపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇప్పటికే విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి రూ.8 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని తెలిపారు.పేదల గృహ నిర్మాణంపైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వం ఖాతాలో వేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రజలను మోసం చేసిందని తెలిపారు.


