చోడవరం సబ్ రిజిస్ట్రార్‌కు పతకాల పంట
● జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా
పతకాలు అందుకుంటున్న గీతాలక్ష్మి
చోడవరం: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చోడవరం సబ్ రిజిస్ట్రార్ బి.గీతాలక్ష్మి పతకాలు సాధించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో 45వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆమె డిస్క్ త్రో విభాగంలో బంగారు, ట్రిపుల్ జంప్‌లో వెండి, లాంగ్ జంప్, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాధించారు. గతంలోనూ గీతాలక్ష్మి అనేక పోటీల్లో పతకాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ పోటీల్లో సత్తా చాటడంతో అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు.


