రక్తపు మడుగుల్లో వృద్ధురాలి ఆర్తనాదం
డాబాగార్డెన్స్: జనంతో కిక్కిరిసిన పూర్ణామార్కెట్ ప్రాంతం కొనుగోళ్ల సందడి మధ్య ఒక్కసారిగా విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన 70 ఏళ్ల వృద్ధురాలు క్షణాల్లోనే రక్తపు మడుగులో పడిపోయింది. ఆరిలోవకు చెందిన ఆమె శనివారం సాయంత్రం మార్కెట్‌కు వచ్చింది. జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వైపు వెళ్తున్న 52డి నంబరు గల ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. కాలు నుజ్జునుజ్జయింది. రక్తస్రావంతో ఆమె రోడ్డుపై పడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. చివరకు కేజీహెచ్‌కు తరలించారు.


