ఏపీ పీఆర్‌ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీ పీఆర్‌ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నిక

Feb 15 2026 7:20 AM | Updated on Feb 15 2026 7:20 AM

ఏపీ పీఆర్‌ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ

ఏపీ పీఆర్‌ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ

మహారాణిపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీరాజ్‌ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి జి.రత్నకుమార్‌ తెలిపారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఓమ్మి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.నరేష్‌బాబు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా బి.రవి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా టి.చంద్రశేఖర్‌, జి.చాందిని, ఎ.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా పి.రాధాలక్ష్మి, వై.విజయకుమారి, ఎం.నాగభూషణం నాయుడు, డి.కవిత ఎన్నికయ్యారు. జాయింట్‌ సెక్రటరీలుగా డి.సింహాచలం, బి.ఈశ్వర్‌, వి.కిరణ్‌, ఎం.వి.ఎస్‌.కౌశిక్‌, కోశాధికారిగా కె.జె.ఎస్‌.చక్రి, కోఆప్టెడ్‌ సభ్యురాలిగా పి.నిర్మల ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎస్‌.రాజేష్‌ ప్రభుకుమార్‌ వ్యవహరించారు. విజయం సాధించిన నాయకులను ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సత్తిబాబు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.త్రినాథ్‌, కె.గంగాధర్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement