ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..

Feb 16 2026 7:45 AM | Updated on Feb 16 2026 7:45 AM

ఉత్తర

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..

నిరుద్యోగులకు మొండి చెయ్యి

చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపింది. రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు గాలిలో కలిపేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ ఇచ్చిన హామీ చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరి రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ప్రతి నిరుద్యోగికీ 20 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. బడ్జెట్‌లో కనీసం కేటాయింపులు చేయలేదు. సూపర్‌ సిక్స్‌ పథకాలు సమర్థంగా అమలు చేశామనడం యువతను వంచించడమే. ఉద్యోగం వచ్చే వరకూ ప్రభుత్వం నుంచి భృతి వస్తుందని ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. – అడిగర్ల రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, నర్సీపట్నం

చంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కూడా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రేమనే చూపింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605 కోట్లు చూపుతున్నారు. వాస్తవికంగా చూస్తే మెజార్టీ నిధులు రూ.400 కోట్లకు పైగా కేవలం పునరావసం, జీతభత్యాలకే వెచ్చించనుంది. అసలైన ప్రాజెక్టు పనులకు రూ.200 కోట్లను కూడా కేటాయించలేదని స్పష్టమవుతోంది. తాండవ ప్రాజెక్టు వద్ద రూ.470 కోట్లకుపైగా వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూ మంత్రంగా రూ.8.13 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకుంది. – గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే.. 1
1/2

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే.. 2
2/2

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement