సర్వం.. సుమనోహరం | - | Sakshi
Sakshi News home page

సర్వం.. సుమనోహరం

Feb 16 2026 7:45 AM | Updated on Feb 16 2026 7:45 AM

సర్వం

సర్వం.. సుమనోహరం

ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

మార్మోగిన పంచాక్షరి

కిటకిటలాడిన ఆలయాలు

దారమఠంలో పూజలు చేస్తున్న భక్తులు

పంచాక్షరి జపం అఖండంగా కొనసాగింది... ఫాలభాగాన పరమ పవిత్రమైన విభూతి రేఖలను ధరించి ఫాలాక్షుని దర్శనం కోసం పరితపిస్తూ భక్తకోటి బారులు తీరింది..తత్‌పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ,ఈశాన ముఖాయనమః అని పంచముఖేశ్వరుని స్మరిస్తూ... పరవశిస్తూ పరమ సంతోషంగా ఫలం,తోయం,పుష్పం,భస్మం సమర్పించింది.. ఆ సుమనోహర దివ్యరూపాన్ని కనులారా వీక్షించి అలౌకికానందంలో తేలియాడింది... జాగరణ చేసి జంగమయ్యను సేవించింది...హర హర మహాదేవ అంటూ పులకించిపోయింది. పుణ్యస్నానాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో అడుగడుగునా ఆధ్యాత్మిక వెల్లివిరిసింది..మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లాలో పంచదార్ల ఉమాధర్మలింగేశ్వరుడిని, ధారమఠంలో ధారమల్లేశ్వరుడిని, చోడవరంలో గౌరీశ్వరుడిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. కల్యాణపులోవ జలాశయం, బలిఘట్టం ఉత్తరవాహిని, పంచధారలోని ఆకాశధారలో భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించారు. శైవ క్షేత్రాలు ఇల కై లాసంగా విరాజిల్లాయి.

– సాక్షి, నెట్‌వర్క్‌

సర్వం.. సుమనోహరం1
1/2

సర్వం.. సుమనోహరం

సర్వం.. సుమనోహరం2
2/2

సర్వం.. సుమనోహరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement