జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ బాధ్యతల స్వీకరణ

Feb 15 2026 7:19 AM | Updated on Feb 15 2026 7:19 AM

జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ బాధ్యతల స్వీకరణ

జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ బాధ్యతల స్వీకరణ

తుమ్మపాల/అనకాపల్లి: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమితులైన శౌర్యమాన్‌ పటేల్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతవరకు అమరావతి కేంద్రంగా ఉన్న ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. కలెక్టర్‌ కార్యాలయ కోఆర్డినేషన్‌ విభాగం పర్యవేక్షకుడు, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌.నాయుడు (వాసు) ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు.

నూకాంబికను దర్శించుకున్న జేసీ

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని నూతన జాయింట్‌ కలెక్టర్‌ సౌర్యమాన్‌ పటేల్‌ శనివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఆలయ సహా కమిషనర్‌ యళ్ల శ్రీధర్‌ అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల సహకారంతో జిల్లా అభివృద్దికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement