
ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం
మునగపాక: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువులను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్‌కు ముందే రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందజేశారన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పనులు ముమ్మ రంగా జరుగుతున్న సమయంలో ఎరువులు,విత్తనాలను అరకొరగా సరఫరా చేయడం విచారకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందస్తు ఆలోచన లేక రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసుకోలేక రైతులు సతమతమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ఈనెల 26న మునగపాక మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామన్నారు. దివ్యాంగ పింఛన్‌లను తగ్గించడం సరికాదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పింఛన్‌లను తగ్గించేందుకు కుతంత్రాలు చేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,సర్పంచ్‌లు బొడ్డేడ శ్రీనివాసరావు,కర్రి పెద బ్బాయి,సుందరపు తాతాజీ,ఆడారి త్రిమూర్తులు,ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు,నాగేశ్వరరావు,మళ్ల కాశీ సురేష్, మాజీ వైస్ ఎంపీపీ దొడ్డి వరాహ సత్యనారాయణ, నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, ఆడారి కాశీబాబు, కాండ్రేగుల జగన్, దొడ్డి బుజ్జి, మొల్లేటి శంకర్, పెతకంశెట్టి రామజోగినాయుడు, కన్నుంనాయుడు,బొడ్డేడ బుజ్జి పాల్గొన్నారు.