
25న ఉపాధ్యాయుల మహాధర్నా
ధర్నా పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
నర్సీపట్నం: పాత పెన్షన్ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న చలో విజయవాడ నిర్వహించనున్నారు. విజయవాడలోని అలంకార్ కూడలి వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఏడు మండలాలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం స్థానిక మున్సిపల్ స్టేడియంలో సమావేశమయ్యారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. పలువురు ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా డీఎస్సీ 2003 బ్యాచ్ ఉపాధ్యాయులు అనివార్యంగా సీపీఎస్ విధానంలోకి బలవంతంగా నెట్టబడ్డారన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ 2003 బ్యాచ్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం ఫోరం నాయకులు చుక్కల రాము, పీఆర్‌టీయూ నాయకులు కె.వి.రమణ, ఎ.అప్పారావు, బి.అప్పారావు, జి.వి.రమేష్, ఏపీటీఎఫ్ నాయకులు పడాల అప్పారావు, శర్మ, దొర, యూటీఎఫ్ నాయకులు ఎం.చిట్టియ్య, గాయత్రీ తదితరులు మాట్లాడారు.
బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో రెండు బార్లకు ఇ–వేలం నిర్వహిస్తున్నామని నర్సీప ట్నం ఎకై ్సజ్ సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. మూడేళ్ల (2025–28)కాలపరిమితితో బార్లకు లైసెన్స్ పొందవచ్చన్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కోదానికి రూ.5 లక్షలు, ప్రాసెస్ ఫీజు రూ.10 వేలు చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌లో కానీ ఆఫ్‌లైన్‌లో కానీ అప్లై చేసుకుని, ఈ నెల 29 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.