అంబేడ్కర్‌ను కించపరుస్తున్నప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ను కించపరుస్తున్నప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

అనకాపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ‘కల్పిత నాయకుడు‘ అని కించపరిచిన హైదరాబాద్‌ నివాసి నాగులరావు వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మల్లారపు లోవచంద్‌ డిమాండ్‌ చేశారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో వరప్రసాద్‌పై శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది అంబేడ్కర్‌ అభిమానుల మనోభావాలు దెబ్బతీయడం అన్యాయమన్నారు. దేశప్రజల హక్కులను హరించే విధంగా పుస్తకాన్ని రాస్తున్న వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు సూదికొండ మాణిక్యాలరావు, కాండ్రేగుల రాము, గెడ్డం దశరథరావు, కంకణాల శ్రీను, కొల్లి సురేష్‌, మర్రా రాజు, యరమాల నర్సింగరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement