చెట్టుపడి గాయాలపాలయిన గొర్రెల మంద
పాయకరావుపేట : మండలంలో గల పెంటకోట గ్రామానికి చెందిన కొల్లి రామలక్ష్మి రమణకు చెందిన 20 గొర్రెలు గాయాలపాలయ్యాయి. తుఫాన్ ప్రభావం కారణంగా ఈదురు గాలులు వేయడంలో ఇంటిపైన చెట్టు పడి ఇల్లు బీటలు వేసింది. పక్కనే వున్న గొర్రెల మందపై కూడా చెట్టు పడి సుమారు 20 గొర్రెలు కాళ్లు విరిగిపోగా, కొన్ని గొర్రెలకు నడుం విరిగిపోయి గాయపడ్డాయని రామలక్ష్మి రమణ దంపతులు విచారం వ్యక్తం చేసారు. గొర్రెలు మేపుకొంటూ వాటి ఆధారంగా జీవిస్తున్నట్టు తెలిపారు.


