కొయ్యూరు: ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందిన శరభన్నపాలెం ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరిని అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి బుధవారం ఆమె స్వగ్రామమైన శరభన్నపాలెంలో సన్మానించారు. ఓట్ల లెక్కింపులో రాజేశ్వరి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. దీంతో కొయ్యూరు మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున నలుగురు ఎంపీటీసీలు గెలుపొందారు. ఈ సందర్భంగా మాధవి ఆమెను అభినందించి సన్మానించారు. పార్టీ కోసం మరింతగా పనిచేయాలని కోరారు. జిల్లాలో ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఆమె పేర్కొన్నారు.


