పాడేరు: విధి నిరర్వహణలో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి తోటి కానిస్టేబుళ్లు అండగా నిలిచారు.ఆ కుటుంబానికి బుధవారం 1990 బ్యాచ్ మేట్స్ శక్తి సంక్షేమ అసోసియేషన్ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. పెదబయలు మండలం అరడకోటకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ కుర్తాడ కొండన్న కశింకోట పోలీసు స్టేష్లో విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో మృతిచెందారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం దుఖసాగరంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆర్థికసాయం అందించిన అనంతరం కానిస్టేబుళ్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కొండన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు. భవిషత్లో ఆ కుటుంబానికి చేయాల్సిన సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూడా పూర్ణచందర్, టి. బాబూరావు, టి.కృష్ణమూర్తి, చెండా సింహాచలం, కేశవరావు, సీహెచ్ సురేష్,లంకెల ప్రసాద్, నాయుడు పాల్గొన్నారు.


