● సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స
పాడేరు రూరల్: వామపక్ష భావజాలానికి నిలువెత్తు ప్రతీక సీపీఎం పార్టీ నేత, స్వర్గీయ కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స అన్నారు. జిల్లా కేంద్రమైన పాడేరులోని పార్టీ కార్యాలయంలో శనివారం సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అప్పలనర్స మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీలకు సీతారాం ఏచూరి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చిట్టిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమ, దాసు, లక్కు, నాయకులు జీవన్, కార్తీక్ పాల్గొన్నారు.


