● ముగ్గురికి గాయాలు
● వీరిలో ఒకరి పరిస్థితి విషమం
డుంబ్రిగుడ : అరకు–పాడేరు జాతీయ రహదారిపై బిల్లాపుట్టు సమీపంలో శనివారం తెల్లవారుజామున కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి అరకు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు కారులో అరకు వైపు వెళ్తుండగా ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ అప్పలనాయుడు, పైలట్ ప్రవీణ్ క్షతగాత్రులను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి తీవ్రంగా గాయపడిన పర్యాటకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


