● సీడీపీవో శ్రీదేవి
చింతపల్లి: గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించినప్పుడే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో శ్రీదేవి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు పంచాయతీ కేంద్రాల్లో జాతీయ పోషణ్ మాస కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కిటుముల పంచాయతీ బౌడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో పాల్గొని, పోషణ్ మాస ప్రాముఖ్యతను వివరించారు. సమతుల్యాహారం అవసరం: గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు జయభారతి, గౌరి, తులసి పాల్గొన్నారు.


