● గుండెపోటు కారణం
● పాడేరులో విషాదం
పాడేరు రూరల్: పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జయరాజు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆయన హఠాన్మరణం పట్ల జిల్లా యంత్రాంగం, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయరాజు మృతి వార్త తెలుసుకున్న పలు శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాడేరులోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం, భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు గ్రామానికి తరలించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.


