పోస్టుకార్డును వేస్తున్న అసోసియేషన్
జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి
అనకాపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ ఉద్యోగులుగా నియామకాలు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్(పారామెడికల్) జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా స్థానిక ఉడ్‌పేట తపాల కార్యాలయం వద్ద పోస్టు డబ్బాలో ఉత్తరాలను బుధవారం వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్ విభాగంగా వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తింపు తీసుకువస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జిల్లా నాయకులు జగదీశ్వరి, శోభ, రమేష్, మోహన్, నందకిషోర్, దివాకర్ పాల్గొన్నారు.


