● పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి
జి.మాడుగుల: ఫేక్ యాప్‌లు, నకిలీ లింకులు, మోసపూరిత మెసేజ్‌లను నమ్మి ప్రజలు ఆర్థికంగా మోసపోవద్దని పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి సూచించారు. మండలంలోని కే.కోడాపల్లి పంచాయతీ కేంద్రంలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. గుర్తుతెలియని లింకులు, యాప్‌లను డేవ్‌లోడ్ చేయవద్దన్నారు. అంతేకాకుండా బ్యాంకు వివరాలు, ఓటీపీ, ఏటీఎం సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మహిళల భద్రతలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ సాయిరాం పడాల్, ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.


