జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగి, కోరాపల్లి పంచాయతీ పరిధిలోని చింతలగొంది, వరదమామిడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ’మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో తహసీల్దార్ గిడ్డి రాజ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు పెద్దబాలన్న గిరిజన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. చింతలగొంది గ్రామంలో మొత్తం 41 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన లబ్ధిదారులు తమ భూములను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయాభివృద్ధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, పాడేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గబ్బాడి శాంతికుమారి, ఎంపీటీసీ రామారావు, మాజీ సర్పంచ్‌లు కృష్ణమూర్తి, అప్పన్నదొర, ఏ.రామూర్తి, వీఆర్వోలు అనిత, యేసురత్నం, సర్వేయర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
అర్హులందరికీ పట్టాలివ్వాలి
గూడెంకొత్తవీధి: అర్హులైన రైతులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని ఎంపీపీ బోయిన కుమారి కోరారు. గూడెంకొత్తవీధి పంచాయతీ బోనంగిపల్లిలో గురువారం తహసీల్దార్ అన్నాజీరావుతో కలిసి 45 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది రైతులకు పట్టాలు అందలేదన్నారు. రీసర్వే అనంతరం వారికి కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిలో స్థానికులు కొర్రా బలరాం, నాగమణి, వీర వెంకట్ పాల్గొన్నారు.


