ఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు కదం తొక్కారు. వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం పాడేరు, అరకులోయలో సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీలకు విశేష స్పందన లభించింది. అరకులోయలో ర్యాలీని అడ్డుకోడానికి పోలీసులు యత్నించినప్పటికీ నిర్బంధాలను, ఆంక్షలను తెంచుకుంటూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. వందలాది మంది పోలీసులను మోహరించినా లెక్కచేయకుండా ముందుకు సాగారు.
పాడేరు, అరకులోయలో భారీ ర్యాలీలు టీచర్ పోస్టులు అమ్ముకోవడం దారుణం మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే..
డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి
డీ
సాక్షి, పాడేరు: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపడంతో పాటు, స్పోర్ట్స్, ఇతర కోటాల పేరుతో అక్రమంగా టీచర్ పోస్టులు అమ్ముకోవడంలో భాగస్వామి అయిన మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన పాడేరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన ర్యాలీని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు మాజీ ఎంపీ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్ అక్రమాలను సాక్ష్యాలతో సహా వైఎస్సార్‌సీపీ వెలుగులోకి తెచ్చినట్లు చెప్పారు. అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు ఆందోళనలు చేపట్టారని, లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై మాత్రం మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. లోకేష్‌కు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, గిరిజన హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు తప్పుడు హామీలిచ్చి నిరంకుశంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజల పక్షాన నిరంతరం వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీవో నంబర్ 3న అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరకు మాజీ ఎంపీ మాధవి మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వైఎస్సార్‌సీపీ నిరూపించిందని చెప్పారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ కళ్లు తెరిచి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి,విద్యా దీవెన పథకాలను కూడా నిలిపివేసి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.
పాడేరులో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎంపీ మాధవి, పరిశీలకుడు సత్యారావు,వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు


