స్పోర్ట్స్‌ కోటా పేరుతో పోస్టులమ్ముకున్నారు | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ కోటా పేరుతో పోస్టులమ్ముకున్నారు

Aug 11 2026 1:06 AM | Updated on Aug 11 2026 1:06 AM

ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ టౌన్‌: డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్‌ కార్యాయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్‌ కోటా అంటూ ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ అమ్ముకున్నారని ఆరోపించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు కొన్ని రోజులుగా తమ పార్టీ పోరాటం సాగిస్తోందని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలు జరగడం వల్ల ఎంతో మంది అభ్యర్థులు నష్టపోయారన్నారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారిని కాదని అనర్హులకు, పచ్చ కండువా ముసుగులో ఉన్న వారికి ఎలా ఉద్యోగాలిస్తారని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ సీబీఐతో విచారణ జరపాలని, అప్పుడే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగుల భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీని అడ్డుకోవడంతో పాటు, మధ్యాహ్నానికి వాయిదా వేయించాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అరకులోయ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, బాణాల శ్రీనివాస్‌, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ జిల్లా ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవి ప్రసాద్‌, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌కుమార్‌, రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్‌ సెక్రటరీ నాగభూషణ్‌, నియోజకవర్గం గ్రీవెన్స్‌సెల్‌ అధ్య క్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వెంకట పూర్ణిమ, వైస్‌ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్‌, అనంతగిరి ఎంపీపీ తెడబారికి మిఽథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్‌ కుమార్‌, జయవర్ధిని, స్వాభి రామచందర్‌, శత్రుఘ్న, నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల అధ్యక్షులు స్వాభి రామ్మూర్తి, పాంగి పరశురామ్‌, కొర్రా సూర్యనారాయణ, పాంగి అనిల్‌ కుమార్‌ మజ్జి చంద్రుబాబు, పాంగి పద్మారావు, మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్‌ విజయ్‌ కుమార్‌, జి.ప్రకాష్‌రావు, జిల్లా కార్యదర్శి బాక సింహాచలం, జనరల్‌ సెక్రటరీ పాంగి నర్శింగరావు, బూత్‌ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్‌, మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకటరావు, బూర్జ సుందర్‌రావు, పార్టీ సీనియర్‌ నాయకులు ఎం.టి.ఆర్‌. సాంబయ్య, బి.బి.కామేశ్వరరావు, నరసింహమూర్తి, పాంగి నాగేశ్వరరావు, పట్టాసి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement