డాబాగార్డెన్స్: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం 108 స్వర్ణపుష్పాలతో అష్టదళ పద్మారాధన వైభవంగా నిర్వహించారు. ఉదయం జరిగిన ఈ ప్రత్యేక పూజలో ఉభయదాతలు పాల్గొన్నారు. సేవా టికెట్ల కోసం భక్తులు 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
ఖడ్గమాల సేవ
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఖడ్గమాల సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవలో పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం వాట్సాప్ ‘మనమిత్ర’ సేవ 9552300009 ద్వారా ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.


