ముద్రగడ మరణం తీరని లోటు | - | Sakshi
Sakshi News home page

ముద్రగడ మరణం తీరని లోటు

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,

పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ నేత, కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకాల మృతి పార్టీతో పాటు ప్రజలకు తీరనిలోటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు.బుధవారం పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నేతలతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, నియోజకవర్గ ఎస్టీసెల్‌ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు వనుగు బసవన్నదొర, సిరగం దశమూర్తి, పార్టీ నేతలు కిల్లు కోటిబాబునాయుడు, పాంగి రాజేష్‌, గడుతూరి నాగేష్‌, రాజంనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement