
గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్
నర్సీపట్నం: గంజాయి అక్రమ రవాణా కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని, వీరిలో మైనర్ బాలుడు ఉన్నాడని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకకు చెందిన మహ్మద్నిజాముద్దీన్(25), సంతోష్(35), చింతపల్లి మండలం, మేడూరు గ్రామానికి చెందిన వంతల బుజ్జిబాబు(30), చిన్నగెడ్డ గ్రామానికి చెందిన వంతల కార్తికేయ(22), 16 ఏళ్లు గిరిజన బాలుడు, ఒడిశాకు చెందిన హరిఖర(20), కారు డ్రైవర్ కర్ణాటటకు చెందిన సిద్ధేష్(25), కారు యజమాని నయీం(45) గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి ఎనిమిది సెల్‌ఫోన్లు, రెండు కార్లు, బైక్ సీజ్ చేశామన్నారు. ముందుస్తు సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు రాజారావు, రామారావు, సిబ్బంది కె.కొండబాబు, ఎస్.త్రిమూర్తులు, దేవేంద్ర గురువారం నర్సీపట్నం మండలం, రెట్టవానిపాలెం శివారులో మాటువేసి, బైక్‌పై వస్తున్న ఫైలేట్‌ను అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. కారు అడుగు భాగంలో ప్రత్యేక అర తయారు చేయించి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. రూ.15 లక్షలు విలువ చేసే 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించామన్నారు.