
కన్నబాబుకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
సాక్షి,పాడేరు: పితృవియోగంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ ఉత్తరాంఽధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. కాకినాడలోని ఆయన స్వగృహంలో వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పలువురు నేతలంతా కన్నబాబును కలిసి పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, అరకులోయ ఎంపీటీసీ దురియా ఆనంద్, మాజీ సర్పంచ్‌లు గుడివాడ ప్రకాష్, పొట్టంగి రాంప్రసాద్, గొల్లోరి ప్రసాద్, ధర్మనాయుడు, నాయకులు సీదరి మంగ్లన్నదొర, అప్పారావు, గిరిప్రసాద్, పోతురాజు, సూర్యనారాయణ, మినుముల కన్నాపాత్రుడు, రీమలి బాలకృష్ణ. చంటి, సుబ్రహ్మణ్యం, వంతాల గురునాయుడు తదితరులు పాల్గొన్నారు.