
అర్హులందరికీ ఉపాధి పనులు
కొయ్యూరు: అర్హులందరికీ ఉపాధి పనులు కల్పించాలని డ్వామా పీడీ పి.విద్యాసాగర్ చెప్పారు. మండల కేంద్రంలోని వీఆర్‌పీలు, ఉపాధి పథకం సిబ్బందితో ఆయన గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీల పనిదినాలు సగటున 290 నుంచి 307 రోజులు ఉండాలన్నారు. పనులపై సక్రమంగా పర్యవేక్షణ ఉండాలన్నారు. అనంతరం ఆయన బూదరాళ్ల రహదారిలో పనులు పరిశీలించారు. చింతపల్లి క్లస్టర్ ఏపీడీ సీతయ్య, ఎంపీడీవో ప్రసాదరావు, ఏపీవోలు శ్రీనివాస్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
గూడెంకొత్తవీధి: మండలంలోని రింతాడ పంచాయతీ ఈదులబందులోని హార్టీకల్చర్‌లోని మొక్కలను డ్వామా పీడీ పి.విద్యాసాగర్ గురువారం పరిశీలించారు. రైతులకు పలు సూచనలిచ్చారు.
చింతపల్లి క్లస్టర్ ఏపీడీ సీతయ్య, హెచ్‌ఆర్ మేనేజర్ ఈశ్వరరావు, ఏపీవో రాం ప్రసాద్, ఈసీ రమణ తదితరులున్నారు.