
అడ్డతీగల ఆశ్రమ పాఠశాలలో వెట్టిచాకిరీ
● విద్యార్థినులతో పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబూరావు విమర్శ
అడ్డతీగల: చదువుకో వాల్సిన సమయంలో విద్యార్థినులతో పను లు చేయిస్తున్న స్థానిక బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులపై చర్యలు తీసు కోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబూరావు డిమాండ్ చేశారు. ఆఫీసు రూమ్‌లో చెత్త ఉడ్పించడం, సరకులు మోయించడం, గార్డెన్‌లో గడ్డి తొలగించడం వంటి పనులను విద్యార్థినులతో చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని ప్రభావం విద్యా ప్రమాణాలపై చూపుతోందని ధ్వజమెత్తారు. దీనిపై ఐటీడీఏ అధికారులు విచారణ జరిపి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.