
వ్యాన్ బోల్తా– పశువులు మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని బరడ పంచాయతీ హంటబొంగు గ్రామ సమీపంలో ఉపాధి హామీ మొక్కలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి మేత మోస్తున్న ఆవులు, మేకలపై బోల్తా పడింది. దీంతో అయిదు ఆవులు, 11 మేకలు మృతి చెందాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం సాయంత్రం బుంగాపుట్టు పంచాయతీలోని గ్రామాలకు ఉపాధి హామీ పథకం ద్వారా పంపిణీ చేసే మొక్కలను వ్యాన్‌లో తీసుకొని వెళ్తుండగా హంటబొంగు గ్రామ సమీపంలో బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి.దీంతో వ్యాన్ రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా కొట్టింది. అక్కడే రోడ్డు పక్కన మేత మోస్తున్న ఆవులు, మేకలుపై పడిపోయింది. దీంతో 5–ఆవులు,11–మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.వ్యాన్ డ్రైవర్ భయంతో పరారయ్యాడు. స్థానిక పోలీసులు ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆవులు, మేకలు మృతి చెందడంతో ఆర్థికంగా నష్టపోయామని, ఆదుకోవాలని హంటబొంగు రైతులు కోరారు.