
విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి
జి.మాడుగుల: విద్యుత్ తీగ తెగిపడటంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు షాక్‌కు గురై మృతి చెందారు. బొయితిలి– మద్దిగరువు గ్రామాల మధ్య గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కిల్లంకోట పంచాయతీ కోడిమామిడి ప్రాంతం నుంచి ట్రాలీపై కాంక్రీట్ మిల్లర్‌ను తీసుకువస్తున్నారు. ఈ సమయంలో బొయితిలి– మద్దిగరువు మధ్యకు వచ్చేసరికి విద్యుత్ లైన్ తగిలింది. దీంతో తీగ తెగి ట్రాలీ వెనుక బైక్‌పై వస్తున్న ఇద్దరిపై పడింది. దీంతో వారు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు నర్సీపట్నానికి చెందిన వారుగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.
బైక్‌పై వస్తుండగా వెంటాడిన మృత్యువు

విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి