
చిరుధాన్యాల సాగుపై అవగాహన
గంగవరం : మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నవజీవన్, హిపర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షుడు కోసూరి రాజారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం అప్పలకొండ మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలన్నారు. గ్రామస్థాయిలో సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. హైపర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీత మాట్లాడుతూ మండలంలో జీడిమామిడి, దుంప విరివిగా పండుతుందని వాటిని గ్రామస్థాయి సంఘాల ద్వారా గాని, రైతుత్పత్తిదారుల సంఘాల ద్వారా విక్రయించి లాభాలు పొందవచ్చన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వీరాంజనేయులు, నాగేశ్వరరావు, బాబూరావు, భవాని, ప్రశాంత్, చిన్నాలు దొర, సింహాచలం, ప్రదీప్, అంజి, పోట్టిదొర, రాజు తదితరులు పాల్గొన్నారు.